నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్
పదేండ్లు పాలమూరు ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ వివక్ష చూపి ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందని తెలంగాణ కిసాన్ కాంగ్రేస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మ తగలపెట్టి నిరసన వ్యక్తం చేసినారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నల్గొండ లో కృష్ణ జలాల మీద పెట్టిన బహిరంగ సభను నిరసిస్తూ దిష్టి బొమ్మ దహనం చేస్తున్నట్టు తెలిపారు.
దొంగే దొంగ అన్నట్లుగా ఉంది కేసీఆర్ తీరు: పదేండ్లు పాలమూరు ప్రాజెక్టులపై వివక్ష చూపి ఇప్పుడు మాట్లాడటం విడ్డురంగా ఉంది. అని అన్నారు.పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును 11-06-2015 రోజు శంకుస్థాపన చేసిన కేసీఆర్ మీరూ దిగిపోయేవరకు కూడా 40శాతం పనులు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలి అని అన్నారు.ఈ ప్రాజెక్ట్ వల్ల మహబూబ్ నగర్ జిల్లా కె కాకుండా రంగారెడ్డి జిల్లాకు కూడా 3 లక్షల ఎకరాలకు సాగు నీరు, నల్గొండకు 30 వేల ఎకరాల సాగు నీరు ఇవ్వకుండా మాట నిలపెట్టుకోలేని నీవు ఏ మొఖం పెట్టుకొని నల్గొండ కు వెళ్తున్నావు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 60 రోజులలోపు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టు కు జి ఓ నంబర్ 14 ద్వారా రూ.2945 కోట్లు విడుదల చేసి సుమారు 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టిండు ఇది కాంగ్రేస్ నిబద్ధత అని అన్నారు.గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లు పాలనలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీటి రంగాల అభ్యున్నతికి తిలోదకాలిచ్చి పది సంవత్సరాల పరిపాలనలో ఏనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఉమ్మడి జిల్లాకు చెందిన నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు 90% శాతం పూర్తిచేసిన 10% పనులకు 10 ఏండ్లు ప్రాజెక్టులకు నయా పెసా ఇవ్వకుండా ఒక ఎకరాకు సాగునీరు ఇవ్వకుండా పట్టించుకోకుండా ఈనాడు 13న నల్గొండలో కృష్ణ బేసిన్ లో ఉండే రైతులకు తరలిరావాలని పిలుపు ఇవ్వడం సిగ్గుచేటు అని,రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని చెప్పింది నీవు కదా?గోదావరి జలాలను కూడా ఆంద్ర కు ఇస్తానని జగనుకు చెప్పింది నిజం కాదా? ఒక్క క్రిష్ణ నీళ్లే కాకుండా గోదావరి నీళ్లు కూడా రైతులకు ఇచ్చిన పాపాన పోలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి బయటపడటంతో కొత్త దుకాణం పెట్టిండు అని ధ్వజమెత్తారు. క్రిష్ణ నదిలో అక్రమంగా ఆంధ్ర ప్రభుత్వం నీటిని దోచుకు పోతున్న ఎందుకు ఆనాడు ఆపలేక పోయినవు ,క్రిష్ణ నది పరివాహక ప్రాంతం తెలంగాణా పరిధిలో 68% గా ఉంది, అదే ఆంధ్ర ప్రాంతం లో కేవలం 32% గా ఉంది, తెలంగాణ లో ఉన్న భూములను కోసుకుంటు ఆంధ్ర లో ప్రవేశిస్తుంది అని,క్రిష్ణ నదిలో తెలంగాణ 484 టీఎంసీ నీటి వాటా హక్కు కలిగి ఉంది. కానీ 06/05/2015 న కేసిఆర్ , నీటిపారుదల శాఖ మంత్రి టీ. హరీష్ రావు సి డబ్ల్యూ సి ముందు తెలంగాణ వాటాగా 299 టీఎంసీ లను ఒప్పుకున్నా మాట వాస్తవం కాదా?ఆనాటి నుండి కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్నీ ఖండిస్తూ వస్తోంది. అని అన్నారు2020, 2021మరియు 2022 సంవత్సరలలో జరిగిన ఆపెక్స్ మీటింగ్లకు సీఎం కేసిఆర్ గారు వరుసగా ఏ ఒక్క మీటింగ్ కూడా హాజరు కాలేదు, ఉదాహరణ కు 5 ఆగస్టు 2020 నాడు జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు సెకరటేరియట్ లో పూజా ఉన్నదనే నెపంతో కేసిఆర్ గారు హాజరు కాలేదు, వాస్తవానికి ఆ రోజు సెక్రటియెట్ లో ఆరోజు ఎలాంటి పూజా జరగనే లేదూ. తర్వాత 14 రోజుల టైం తిస్కున్న సీఎం గారు 19ఆగస్టు 2020 నాడు హాజరు అయ్యారు. కానీ 14 రోజుల వ్యవధిలో జరిగిన తతంగం ఏమిటంటే, మేఘ ఆర్ ఎల్ ఐ పనులు కృష్ణా రెడ్డికి లబ్ది చేకూర్చడం. 16 ఆగస్టు 2020 న టెండర్ లు వేయడం,18 ఆగస్టు 2020 న టెండర్ లు ఓపెన్ చేయడం అవి మేఘ కృష్ణా రెడ్డికి దక్కడం వరుసగా జరిగిపోయాయి. ఈవిధంగా మేఘ కృష్ణా రెడ్డి కి టెండర్లు దక్కిన తర్వాత కేసిఆర్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు హాజరవడం కేసిఆర్ కు, మేఘ కృష్ణా రెడ్డి కి మధ్య రహస్యపు కుట్ర పూరిత ఆలోచనలను మనం గ్రహించవచ్చు అని, అదేవిధంగా 2023-24 బడ్జెట్ లో సీఎం కేసిఆర్, ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావులు రూ.200 కోట్ల రూపాయలను క్రిష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కి కేటాయిస్తూ, మన దగ్గర ఉన్న క్రిష్ణ నది మీద ఉన్న ప్రాజెక్ట్ లకు మెయింటేన్న్స్ హ్యాండ్ ఓవర్ చేసింది మీరుకాదా? 2004 కు ముందు కేవలం 11400 టీఎంసీ ల నీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకుపోయే హక్కు ఆంధ్రప్రదేశ్ కు ఉండేది, అప్పటికి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దానిని 44000 క్యూసెక్కులకు పెంచాడు. ఆనాడు కేసీఆర్ తో పాటు యావత్ తెలంగాణ సమాజం గొడవ చేయడం జరిగింది అని గుర్తు చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వచ్చిన తరువాత 5మే 2020 లాక్ డౌన్ సమయంలో 203 జీవో తెచ్చి 83000 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లే విధంగా రూ.6820 కోట్ల బడ్జెట్ కేటాయించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని తీసుకెళ్తుంటే, ఆనాటి కేసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. క్రిష్ణ నదికి కుడివైపున ఉన్న సంగమేశ్వర ప్రాజెక్ట్ ద్వారా కూడా ప్రతి రోజు 3 టీఎంసీల నీటిని కూడా ఆంధ్రప్రభుత్వం తీసుకెళ్తుంటే కూడా కేసిఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు అని, ఇలా తెలంగాణకు అన్యాయం చేసి ఇప్పుడు తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఈ డ్రామాలు అని, అందుకే కేసీఆర్ దిష్టి బొమ్మలను తగలపెట్టి నిరసన చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు నర్సారెడ్డి, అనిల్ గౌడ్,దామోదర్ గౌడ్, స్వరూప,నరేంద్ర భగవాన్ దాస్,రమణ, రాము, టాక్కర్ గంగాధర్, లింగేష్,జాను, ఇంద్ర గౌడ్,జెమ్స్, శ్రీను, మల్లయ్య, సచిన్, రాజేందర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.