– ఏటా తగ్గుతున్న లబ్ధిదారుల సంఖ్య
– పలు రకాల నిబంధనలే కారణం
– అవగాహన లేక నష్టపోతున్న రైతన్నలు
– మండలంలో ప్రస్తుతం అర్హులు 2,351 మంది మాత్రమే..
నవతెలంగాణ – మల్హర్ రావు
రైతులకు పెట్టుబడి, ఇతర అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్హత కలిగిన రైతులకు సంవత్సరంలో మూడు విడతలుగా రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేల నగదును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే ఈ పథకం అమలులో ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలు రైతుల పాలిట శాపం గా మారుతున్నాయి. ఏటా రైతుల సంఖ్య పెరుగు తున్నా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తోంది. ప్రభుత్వం అవినీతి అక్రమాలు తావులేకుండా ప్రతీ రైతు ఆధార్ నంబర్ అనుసంధానం చేసుకోవాలనే నిబంధన విధించింది. పూర్తిస్థాయి అవగాహన లేక అనేక మంది ఆధార్ నంబర్ అనుసంధానం చేసుకోలేదు. దీంతో వారు పథకానికి దూరమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రైతు లకు 16 విడతల్లో రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం జమ చేసింది.ఇటీవల 17వ విడత సైతం విడుదల చేయగా ప్రారంభంలో ఉన్న అర్హులైన రైతులతో పోల్చితే ప్రస్తుతం వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.

తగిన అర్హులు..
మండలంలోని 15 గ్రామపంచాయతీల పరిధిలో 22 రెవెన్యూ గ్రామాల పరిధిలో 9,730 వేల మంది రైతులు ఉన్నారు.చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరాలనే లక్ష్యంతో ప్రారంభంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఐదేకరాల లోపు భూమి ఉన్న వారిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. అప్పుడు మండలంలో 2,527 వేల మంది అర్హులుగా ఉండగా, 17వ విడతలో వారి సంఖ్య 2,351కు తగ్గిపోయింది. పథకం అమలులో ప్రభుత్వం పలు రకాల నిబంధనలు, షరతులు విధించడంతో చాలామంది పథకానికి దూరమవుతున్నారు.ప్రభుత్వ ఉద్యోగులు,ఆదాయ పన్ను చెల్లికచేవారికి పథకాన్ని నిలిపివేశారు.కుటుంబంలో బార్యభర్తలిద్దరికి ఈ పథకాన్ని వర్తింపజేయగా ప్రస్తుతం కుటుంబంలో భార్య లేదా భర్తకు ఒక్కరికి మాత్రమే వర్తింపజేస్తున్నారు.
కొత్త వారికి అవకాశమేది..?
కేంద్ర ప్రభుత్వం రైతులకు పంటల పెట్టుబడిలో సాయమందించేందుకు అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో కొత్త రైతులకు అవకాశం దక్కడం లేదు. 2018- 19లో ఈ పథకాన్ని ప్రారంభించగా కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 1 వరకు పట్టా పాసుపుస్తకాలు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం అమలు చేస్తోంది. 2019 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో వేలాది మంది రైతులు కొత్త పాస్పుస్తకాలు పొందారు. వారికి మళ్లీ అవకాశం కల్పించలేదు. వారు వివరాల నమోదు కోసం వ్యవసాయశాఖ అధికారుల కార్యాలయాల శాఖ చుట్టూ తిరుగుతున్నారు.విరాసత్ ద్వారా కొత్త పాస్ పుస్తకాలు పొందిన కొత్త రైతుల పేర్లను మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్ తీసుకుంటోంది.మరణించిన తల్లి లేదా తండ్రి గతంలో పీఎం కిసాన్ పథకంలో పేర్లు నమోదు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం పంటల పెట్టుబడికి ఎంతకొంతో మేర ఉపయోగకరంగా ఉంటుందని కోరుతున్నారు.
ఆవాహన లేక..
పీఎం కిసాన్ సమ్మాన్ నిది పథకం అమలులో అవినీతి, అక్రమాలకు చోటులేకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది.ఇందులో భాగంగా పలు రకాల నిబంధనలు,షరతులు విధించింది.అర్హులు తప్పనిసరిగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఐడి నెంబర్ కు ఆధార్ నెంబర్ అనుసంధానం చేసుకోవాలని సూచించింది.అయితే గ్రామాల్లో నిరక్షరాస్యులైన రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన లేక నేటికి వందలాది మంది ఈకెవైసి చేయించుకోలేదు.వ్యవసాయ శాఖ అధికారులు సైతం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించడం లేదు.
కొత్తవారికి అవకాశం ఇవ్వాలి: రైతు సమ్మయ్య తాడిచెర్ల
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కొత్తగా పాస్ పుస్తకం పొందిన రైతులకు కూడా అవ కాశం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరికి ముందు పాస్ పుస్తకం ఉన్న వారికి మాత్రమే నగదు జమ చేస్తోంది. 2019కి ముందు నాకు 1.5 ఎకరం ఉంటే 2019లో మరో ఎకరం 30 గుంటల భూమి కొనుగోలు చేసిన, రెండింటికీ పైసలు పడుతలేవు.