కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామనడం కిషన్‌ రెడ్డి అవివేకం

– టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌ గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని మాట్లాడటం కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అవివేకానికి నిదర్శనమని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌ గౌడ్‌ ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, 2018 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్రంలో ఒకే ఒక్క సీటు గెలిచిన విషయాన్ని మరిచారా? అని ఎద్దేవా చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ నాయకులు బొక్కా బోర్లా పడ్డారని విమర్శించారు. మళ్లీ రానున్న ఎంపీ ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలుస్తామని మాట్లాడటం కిషన్‌ రెడ్డి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం కాదా? అని సుధాకర్‌ గౌడ్‌ ప్రశ్నించారు.