మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని మండల స్పెషల్ అధికారి కిషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం తప్పకుండా విద్యార్థులకు అందించాలన్నారు.పౌష్టికాహార పదార్థాలతో పాటుగా వంటకాలను రుచికరంగా వండాలని సూచించారు. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పిల్లలతో కలిసి భోజనం చేశారు. పాఠశాల ఆవరణతో పాటుగా భోజనం కూడా బాగుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దశరథ్,ఎంపీఓ లక్ష్మీ కాంత్ రెడ్డి,సెక్రటరీ శ్రీనివాస్,గురుకుల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ సునీత,జిల్లా పరిషత్ఉన్నత ప్రధానోపాధ్యాయురాలు కమల,విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.