కిస్మత్‌ రిలీజ్‌కి రెడీ

కిస్మత్‌ రిలీజ్‌కి రెడీనరేష్‌ అగస్త్య, అభినవ్‌ గోమఠం, విశ్వ దేవ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న బడ్డీ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘కిస్మత్‌’. కామ్రేడ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శ్రీనాథ్‌ బాదినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలో పోషిస్తున్నారు. రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిహెచ్‌ భానుప్రసాద్‌ రెడ్డి సహ నిర్మాత. ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ గ్రాండ్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించింది. డైరెక్టర్‌ శ్రీనాథ్‌ మాట్లాడుతూ, ‘కరోనా లాక్‌డౌన్‌ సమయంలో నిర్మాత రాజు పరిచయమయ్యారు. దాదాపు ఆరు నెలలు పాటు వర్క్‌ చేశాక కథ అద్భుతంగా వచ్చింది.ఈ చిత్రం ప్రేక్షకులందరినీ ఎంటర్‌టైన్‌చేస్తుంది’ అని అన్నారు. ‘శ్రీనాథ్‌ నాకు చాలా నచ్చిన డైరెక్టర్‌. చాలా క్లారిటీతో ఉంటారు. ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. నిర్మాత రాజు చాలా కూల్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉంటారు. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను’ అని శ్రీనివాస్‌ అవసరాల చెప్పారు. సంగీత దర్శకుడు మార్క్‌ కే రాబిన్‌ మాట్లాడుతూ,’చాలా మంచి కంటెంట్‌ ఉన్న సినిమా ఇది. మా కిస్మత్‌ని ప్రేక్షకులు మారుస్తారనే నమ్మకం ఉంది’ అని అన్నారు.