– ప్రారంభించిన పర్యాటకశాఖ మంత్రి జూపల్లి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ సంస్కృతి, సాంద్రాయాలకు ప్రతీక కైట్ ఫెస్టివల్ అని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు అన్నారు. అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్‌ను శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రుల పతంగులను ఎగుర వేసారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో అంతరించి పోతున్న కళలు, కళారూపాలు, ఆటలను బతికించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. చదువుతో పాటు ఆట పాటలవైపు యువతను మళ్లించేదుకు తల్లిదండ్రులు సైతం ప్రొత్సహించాలని సూచించారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పతంగుల పండుగను ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, టూరిజం డైరెక్టర్ కె. నిఖిల, స్పోర్స్ట్ కమిషనర్ లక్ష్మి, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ రమేష్ నాయుడు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ, క్లిక్ ప్రతినిధులు బెంజిమిన్, అభిజిత్,, వీణా రాణి రెడ్డి, విఠల్ జోషి, అజిత్, పవన్ సోలాంకీ తదితరులు పాల్గొన్నారు.
40 దేశాలకు చెందిన క్రీడాకారుల రాక
మూడు రోజుల పాటు (ఈ నెల 15 వరకు) కొనసాగనున్న ఉత్సవాల్లో 16 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ, 60 మంది జాతీయ కైట్ ప్లేయర్లు పాల్గొని తమ పతంగులను ఎగుర వేశారు. తెలంగాణ సాంప్రదాయ వంటలతో పాటు పంజాబ్, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాల కు చెందిన మహిళలు ఇంట్లోనే తయారు చేసిన 400 రకాల స్వీట్లను పుడ్ కోర్టుల్లో ప్రదర్శించి విక్రయిస్తున్నారు. ఫెస్టివల్ లో భాగంగా హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాల్స్‌తో పాటు కళారూపాల ప్రదర్శన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను. ఏర్పాటు చేశారు. ప్రదర్శన తిలకించటానికి వచ్చే సందర్శ కులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించారు. మూడు రోజులపాటు జరిగే వేడుకలకు దాదాపు 15 లక్షల మంది హాజరువుతారని భావిస్తున్నారు.