– న్యూజిలాండ్ ఖాతాలో 4వ విజయం
చెన్నై : ఐసీసీ ప్రపంచకప్‌లో 2015, 2019 రన్నరప్ న్యూజిలాండ్ జోరు కొనసాగుతుంది. ప్రపంచకప్ గ్రూప్ దశలో ఆ జట్టు వరుసగా నాల్గో విజయం నమోదు చేసింది. బుధవారం ధర్మశాలలో అఫ్గనిస్థాన్‌పై కివీస్ 149 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 288 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (71, 80 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), టామ్ లేథమ్ (68, 74 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), విల్ యంగ్ (54, 64 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రాణించారు. ఛేదనలో అఫ్గనిస్థాన్ 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లు లాకీ ఫెర్గుసన్ (3/19), మిచెల్ శాంట్నర్ (3/39), ట్రెంట్ బౌల్ట్ (2/18) అఫ్గాన్‌ను శాసించారు. అఫ్గాన్ బ్యాటర్లలో రెహమత్ షా (36), అజ్మతుల్లా (27) మాత్రమే చెప్పుకోదగిన పరుగులు చేశారు.