దేవ్‌రాజ్‌కు కేకే అభినందనలు

KK Congratulations to Devraj– జగన్‌ మోహన్‌ రావు నేత త్వంలోని హెచ్సిఏ కార్యవర్గానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె కేశవరావు ప్రశంసలు
హైదరాబాద్‌ : వచ్చేనెలలో జరగనున్న ప్రతిష్టాత్మక ఐసిసి ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడే టీం ఇండియా కి మేనేజర్‌ గా నియమితులైన హెచ్‌ సి ఏ కార్యదర్శి ఆర్‌ దేవ్‌ రాజ్‌ ను కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కె కేశవరావు అభినందించారు. బుధవారం కేశవరావును ఆయన నివాసంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌ మోహన్‌ రావు, కార్యదర్శి దేవ్‌ రాజ్‌, కోశాధికారి సీజే శ్రీనివాస్‌ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందఠంగా బిసిసిఐ దేవ్‌ రాజ్‌ ను టీమిండియాకు మేనేజర్‌ గా నియమించినందుకు హర్షం వ్యక్తం చేశారు. జగన్‌ మోహన్‌ రావు అధ్యక్షతన కొత్త కార్యవర్గం ఏర్పాటైన తర్వాత హెచ్‌ సి ఏ పనితీరు మెరుగుపడిందని అయన ప్రశంసించారు. భవిష్యత్తులో తెలంగాణ లో క్రికెట్‌ అభివ ద్ధికి సభ్యులంతా ఒక తాటిపైన కలిసి పనిచేయాలని సూచించారు, ప్రభుత్వం నుంచి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.