లక్నో: లక్నో సూపర్ జెయింట్స్‌కు ఊరట లభించింది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించినట్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో రాహుల్ ఈ ఐపిఎల్ సీజన్‌లో ఆడేందుకు మార్గం సుగుమమైంది.కానీ, టోర్నీ ప్రారంభదశలో వికెట్‌కీపింగ్‌కు దూరంగా ఉండి స్పెషలిస్ట్ బ్యాటర్‌గా బరిలోకి దిగాలని బిసిసిఐ వైద్యబృందం సూచించింది. రాహుల్ రెండ్రోజుల్లో లక్నో సూపర్ జెయింట్స్‌తో కలవనున్నాడు. మార్చి 24న రాజస్థాన్ రాయల్స్‌తో లక్నో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ మధ్యలో రాహుల్ గాయపడిన విషయం తెలిసిందే. లండన్ వెళ్లి ప్రత్యేక వైద్యబృందంతో చికిత్స చేయించుకుని భారత్‌కు తిరిగొచ్చాడు. ఫిట్‌నెస్ సాధించేందుకు నేరుగా జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లాడు.