రిటైర్మెంట్‌ యోచనలో కెఎల్‌ రాహుల్‌..?

In retirement planning KL Rahul..?బెంగళూరు : దులీప్‌ ట్రోఫీకి సన్నద్ధమ వుతున్న కెఎల్‌ రాహుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌ అతని అభిమానులకు షాక్‌కు గురి చేసింది. శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో అతడి గురించిన ఓ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. రాహుల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ స్టార్‌ ప్లేయర్‌ సిగేచర్‌ స్టయిల్‌ సెలబ్రేషన్‌ ఫొటోతో పాటు సుదీర్ఘ పోస్ట్‌ ఉంది. దాంతో, ఆ పోస్ట్‌ చూసిన అభిమానులంతా షాకయ్యారు. అసలు ఆ పోస్ట్‌లో ఏం ఉందంటే.. ‘సుదీర్ఘ సమాలోచన, చాలా చర్చల తర్వాత ఫ్రొఫెషనల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. నా జీవితంలో కీలక భాగమైన క్రికెట్‌కు ఆటకు అల్విదా చెప్పడం సులువైన నిర్ణయం కాదు’ అని రాసి ఉంది. దాంతో, ఫ్యాన్స్‌తో పాటు పలువురు క్రికెటర్లు సైతం ఇదేంటీ? రాహుల్‌ వీడ్కోలు చెప్పాడా? అని ఆందోళనకు లోనయ్యారు. అయితే.. అదంతా ఫేక్‌ న్యూస్‌ అని సమాచారం. దాంతో, అభిమానులు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు. తాను క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్టు వన్తున్న వార్తలపై రాహుల్‌ స్పందించాడు. ‘నేను ఓ ప్రకటన చేయబోతున్నా. వేచి ఉండండి’ అంటూ మాత్రమే ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు.