– అమెరికాలో పోలీసుల కర్కశత్వం
– నల్లజాతీయుడు మృతి
– ఎమోరీ వర్సిటీలో మహిళా ప్రొఫెసర్‌పై దాష్టీకం
వాషింగ్టన్ : అమెరికా పోలీసుల దాష్టీకం రోజురోజుకూ పెరిగిపోతోంది. వారి దురహంకారానికి మరో నల్ల జాతీయుడు బలయ్యాడు. మరో ఘటనలో పాలస్తీనా అనుకూల నిరసనలకు హాజరైన మహిళా ప్రొఫెసర్‌ను కిందపడేసి పోలీసులు బేడీలు వేశారు ఈ ఘటనలను నిరసిస్తూ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. 2020లో మిన్నెపొలిస్ నగరంలో పోలీసుల కర్కశత్వానికి ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన రీతిలోనే తాజాగా మరో నల్లజాతీయుడు బలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఓహియోలోని కేంటన్ పోలీసు విభాగం విడుదల చేసిన బాడీ కెమెరా వీడియోతో దిగ్భ్రాంతికరమైన అంశాలు వెలుగు చూశాయి.ఈ ఘటనపై స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు పేరు ఫ్రాంక్ టైసన్ (53). ఆయన ఒక కారు ప్రమాదం కేసులో అనుమానితుడు. ప్రమాదం అనంతరం ఒక బార్‌లోకి పారిపోయాడని గుర్తించిన పెట్రోలింగ్ అధికారులు టైసన్‌ను అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేశారు. వారు తనను చంపడానికి వస్తున్నారంటూ టైసన్ కేకలు వేయడం ఆ వీడియోలో వినిపిస్తోంది. ఆ తర్వాత పోలీసులు అతడిని నేలపై పడేసి, చేతికి బేడీలు వేశారు. ఒక అధికారి అతడి మెడపై మోకాలితో అదిమిపట్టాడు.ఈ క్రమంలో టైసన్ ”నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను” అని మొత్తుకోవడం కూడా ఆ వీడియోలో వినిపిస్తోంది. అయినా అధికారులు వినిపించుకోలేదు. అరవద్దు, నోరు మూసుకో అంటూ ఒక అధికారి తిట్టడం కూడా వినిపించింది. దాదాపు ఆరు నిముషాల తర్వాత టైసన్‌లో ఎలాంటి చలనం కనిపించపోవడంతో ‘బతికున్నాడా లేదా’ అనుకుంటూ పోలీసులు ఆయన చేతికున్న బేడీలు తీసివేసి, సిపిఆర్ చేయడం వీడియోలో కనిపించింది. ఆ వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన మరణించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణకు ఆదేశించారు. ఆయన మృతికి అధికారికంగా కారణం ఏమిటనేది పోలీసులు వెల్లడించలేదు. ఈ ఘటనకు కారణమైన