– పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగుడు
– మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో…
నవతెలంగాణ-మేడ్చల్
గుర్తుతెలియని యువకుడు ఓ ఇంట్లోకి చొరబడి కత్తితో మహిళపై దాడి చేసి బంగారం, పుస్తెలతాడు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మున్సిపల్ పరిధి అత్వెలీలోని ఎస్‌ఎల్ ఆర్ వెంచర్‌లోని ఓ ఇంట్లో బాగారి మహామాయ అనే మహిళ నివసిస్తోంది. ఆదివారం రాత్రి ఆమె ఇంట్లోకి మంకీ క్యాప్ పెట్టుకుని గుర్తు తెలియని యువకుడు చొరబడ్డాడు. కత్తితో ఆమెపై దాడి చేసి మెడలోని బంగారు పుస్తెల తాడు, మరో బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు.
ఈ దాడిలో మహిళ కుడి చేతికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి క్లూస్ టీం, డాగ్స్ స్క్వాడ్ చేరుకొని పరిశీలించారు. పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు మేడ్చల్ పోలీసులు తెలిపారు.