అ’ల్లేసు’కునే అందాలు

అ'ల్లేసు'కునే అందాలుమారుతున్న ఫ్యాషన్‌ ట్రెండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్‌ వస్త్రాలు యువత కోసం ప్రత్యేకంగా అవతరిస్తున్నాయి. జాకెట్స్‌, ఓవర్‌ కోట్స్‌ తరహా లేస్‌ వస్త్రాలు యువతులని, మహిళలను ఆకర్షిస్తున్నాయి. అంతర్జాతీయ ఫ్యాషన్‌ వీక్‌లలో సైతం లేస్‌ హవా కొనసాగుతుండటంతో ఈ ట్రెండ్‌ను అనుసరించడానికి ఆసక్తిని చూపుతున్నారు. లేస్‌తోనే జంప్‌ సూట్స్‌ కూడా తయారుచేస్తున్నారు డిజైనర్లు. సంప్రదాయాలలో సమకాలీనత ప్రతిబింబించాలంటే ‘లేస్‌ – బెస్ట్‌ ఆప్షన్‌’ అని చెప్పకనే చెప్తున్నారు. లేస్‌ అనేది డెలికేట్‌ ఫ్యాబ్రిక్‌. దీన్ని కేవలం కాటన్‌ దారాలతోనే కాదు, సిల్క్‌, లెనిన్‌ దారాలతో కూడా నేస్తారు. కొన్ని చేతితో నేస్తే, కొన్ని మెషీన్‌ మేడ్‌ ఉంటాయి. మెషీన్‌ వాటికి సింథటిక్‌ ఫైబర్‌ని ఉపయోగిస్తారు. 80వ దశకంలో పాప్‌సింగర్‌ మడోనా తన షోలకు లేస్‌ డ్రెస్‌లతో ఆట, పాటలతో పాటు కుర్రకారు గుండెలను హీటెక్కెంచింది. తర్వాత ఆ డ్రెస్‌లను మడోనా డ్రెస్‌లుగా పిలిచారంటే నమ్మాల్సిందే! లేస్‌ డ్రెస్‌లను ధరించటం అంత సులభం ఏమీ కాదు. ధరించే లేస్‌ డ్రెస్‌కు, యాక్ససరీకు సరిగా మ్యాచ్‌ అయ్యేలా ధరించటం ఎంత ముఖ్యమో, ఫిజికల్‌ ఫీచర్స్‌కు తగిన రీతిలో ఈ లేస్‌ను ఎంచుకోవటం కూడా ఇంపార్టెంటే. లేస్‌ డ్రెస్‌ వేసినప్పుడు ముత్యాలు ధరిస్తే మాత్రం ఇంకాస్త ఎట్రాక్షన్‌గా కనిపిస్తారు.
– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి
8008 577 834