నేల ప్రాముఖ్యతను తెలుసుకోవాలి

– గ్రామ వ్యవసాయ అధికారి సతీష్ 
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని నాగుల్ గావ్ గ్రామ క్లస్టర్ పరిధిలోని రైతు వేదిక అందు ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా నేల యొక్క ప్రాముఖ్యత, నేల యాజమాన్యం, యాసంగి పంటల యాజమాన్యంపై అవగాహన సమావేశం నిర్వహించారు. అందులో నేల భూసారాన్ని పెంచటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి రైతు సోదరులకు గ్రామ వ్యవసాయ అధికారి సతీష్  వివరించారు. ఈ సమావేశానికి  విజయ్ పటేల్, అనిల్ గొండ, గుండేవర్ ఉమేష్, అనిల్ కుమార్, పాటిల్ శివాజీ, హైబతి గంగాధర్, గుణవంత్ రావు, జెట్టి బాలాజీ, మెత్రే బాలాజీ, రాజు, బాబు, బైసాలి నార్ గోండా తదితర రైతు సోదరులు హాజరయ్యారు.