సమాచారం తెలుసుకుని సభలో మాట్లాడాలి..

– ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌ బాబు మండిపాటు
నవతెలంగాణ- మల్హర్ రావు
సమాచారం తెలుసుకొని సభలో మాట్లాడాలని రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఎమ్మెల్యే హరీశ్‌ రావు పై మండిపడి, వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం మంత్రి దుద్దిళ్ల మాట్లాడారు సత్యదూరమైన మాటలు చెప్పి సభను పక్కదారి పట్టించవద్దని మంత్రి సూచించారు. లెక్కల్లో తప్పొప్పులు ఉంటే ఆర్థిక శాఖ మంత్రి చెబుతారని, నివేదిక ఎవరో తయారు చేశారనే మాటలు సరికాదన్నారు.హరీశ్‌ రావు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మంత్రి కోరారు.