ఆయిల్ ఫాం లో అంతర పంటలు,సోకే చీడపీడలు అవగాహన ఎంతో అవసరం….

– మెరుగైన యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు…..

– సాగులో మెలుకువలు తో నీటి ఆదా….

– పలు అంశాలు పై ఉద్యాన నిపుణులు ప్రసంగాలు…

నవతెలంగాణ – అశ్వారావుపేట

ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆయిల్ప ఫాం పరిశ్రమ అనుబంధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన ఆయిల్ ఫాం సాగు దారుల అవగాహన సదస్సు రైతులకు ఎంతో ఉపయుక్తంగా సాగింది.

ఇందులో పలువురు ఉద్యాన శాస్త్రవేత్తలు ఆయిల్ ఫాం సాగులో మెలుకువలు,నీటి తడులు నిర్వహణ,చీడపీడలు అధిగమించే పద్దతి,ఆయిల్ ఫాం లో అధిక దిగుబడులు అనే అంశాలు సోదాహరణంగా వివరించారు.

స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ జే.హేమంత్ కుమార్ వ్యాఖ్యాన ఆద్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయిల్ ఫాం పంటను ఆశించే కీటకాలు గెలలు ఉత్పత్తి లో వాటి పాత్ర పై భారతీయ ఆయిల్ ఫాం పరిశోధనా కేంద్రం పెదవేగి సీనియర్ సైంటిస్ట్ ఏ.ఆర్.ఎన్.ఎస్ సుబ్బన్న,ఆయిల్ ఫాం సాగులో నీటి తడులు నిర్వహణ,ఫలదీకరణం లో వ్యవహరించాల్సిన యాజమాన్యం పద్దతులు పై ఉద్యాన సాంకేతిక సలహాదారు డాక్టర్ బీ.ఎన్ రావు,ఆయిల్ ఫాం సాగులో అంతర పంటలు,సాగు నిర్వహణ పై శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన,పట్టు విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.రాజశేఖర్,ఆయిల్ పై ఫాం సాగు కై మొక్కలు ఎంపిక, నాటే పద్దతులుపై ఉద్యాన పరిశోధనా సైతాను అశ్వారావుపేట సీనియర్ సైంటిస్ట్ జి.విజయ్ క్రిష్ణ,ఆయిల్ ఫాం పంటను సోకే చీడపీడలు,నివారణ పద్దతులు పై వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత్ కుమార్ లు బోధించారు.అనంతరం రైతులు సందేహాలను నివృత్తి

చేసారు.