– ఒకరిని పట్టణ పోలీసులకు అప్పజెప్పిన వైనం…
నవతెలంగాణ – కోదాడరూరల్
వడ్ల వ్యాపారి నుండి నగదు దొంగలించి పరారైతున్న ఇద్దరు వ్యక్తులను వెంబడించి పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం వద్ద చోటుచేసుకుంది. పట్టణంలోని ఒక వ్యాపారి నుండి డెబ్బై వేల రూపాయలు నగదు,బంగారం చోరీ చేసి పరారైతున్న ఇద్దరు వ్యక్తులను శ్రీరంగాపురం యువకులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఒకరు పరారీ కాగా మరొక యువకుడికి దేహశుద్ధి చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన మరొక వ్యక్తికై గాలింపు చర్యలు చేపట్టారు.