మైలారంలో ఘనంగా కోదండ రాముడి కళ్యాణం

నవతెలంగాణ – రాయపర్తి : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని మైలారం గ్రామంలో రామాలయంలో ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. ఎస్ఆర్ఆర్ గ్రూప్ అధినేత పరిపాటి శ్రీనివాస్ రెడ్డి దంపతులు కళ్యాణంలో పాల్గొని రాములవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు. ప్రధాన అర్చకులు రామకృష్ణ చార్యులు వేద మంత్రోచ్ఛరణల మధ్య కన్నులపండువగా రాములోరి కళ్యాణం జరిపారు. ఒక్కరోజు ముందుగానే ఆలయంలో విద్యుత్‌కాంతులతో ముస్తాబు చేసిన ఆలయ కమిటీ సభ్యులు సీతారాముల కల్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భాజాభజంత్రీలు, వేదమంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కల్యాణాన్ని ఎంతో కమనీయంగా నిర్వహించారు. తదుపరి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొమ్మినేని రంగారెడ్డి, జడ్పిటిసి రంగు కుమారస్వామి, మాజీ సర్పంచ్ తేతాకుల సుమతి యాదవ రెడ్డి, సంధి బుచ్చిరెడ్డి, పైడిపల్లి భీమారెడ్డి, డాక్టర్ యాదగిరి, సామాజిక కార్యకర్త కిరణ్ కుమార్ రెడ్డి, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.