
వేసవి కాలంలో ప్రజలు, ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ కోరారు. శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ లో తెలంగాణ ఎం ఆర్ పి ఎస్ నాయకులు వంగపల్లి శ్రీనివాస్ సహకారంతో ఏర్పాటు చేసిన “మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ” కార్యక్రమం ను ఆయన ప్రారంభించి, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, ప్రయాణికులు వేసవికాలం లో ఆరోగ్యాన్ని హాని కలిగించే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీం లాంటి వాటి జోలికి వెళ్లకుండా, మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ లాంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి బస్ స్టేషన్ మేనేజర్ రత్నయ్య, కంట్రోలర్ సుధాకర్ రెడ్డి, వంగపల్లి యువసేన నాయకులు శ్రీధర్, ఆర్టీసీ సిబ్బంది వెంకటేష్, మురళి పాల్గొన్నారు.