కంకర టిప్పర్‌ తగిలి కోడెలేగా మృతి

కంకర టిప్పర్‌ తగిలి కోడెలేగా మృతినవతెలంగాణ-చింతలమానేపల్లి
మండలంలోని కర్జెల్లి గ్రామంలో ప్రధాన రహదారిపై కంకర టిప్పర్‌ తగిలి కోడేలేగ మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..రాత్రి సమయంలో కంకర టిప్పర్‌ డ్రైవర్లు అతివేగంతో వెళ్తున్నారు. రహదారిపై ఉన్న కోడెలేగాను రాత్రి సమయంలో టిప్పర్‌ ఢ కొట్టి వెళ్లింది. వేకు జామున చూసేసరికి కోడేలేగా తలపై నుండి తొక్కించుకొని పోగా అక్కడికక్కడే మృతి చెందినట్టు గ్రామస్తులు గుర్తించారు. కంకర టిప్పర్లు అధిక లోడ్‌ బరువు, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్తులు తెలిపారు.