ఘనంగా కోడి రామకృష్ణ జయంతి వేడుకలు

In the context of women's self-respect.

శతాధిక చిత్ర దర్శకుడు కోడి రామకృష్ జయంతి వేడుకలు ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా జరిగాయి. వాసవి ఫిల్మ్‌ అవార్డ్స్‌ సారథ్యంలో నిర్వహించిన ఈ వేడుకలో సినిమా రంగంతోపాటు ఉభయ రాష్ట్రాలలోని పలు రంగాల్లో సేవలు చేస్తున్న సామాజిక సేవాతత్పరులు, ప్రతిభావంతులకు ఘన పురస్కారాలు అందించారు. తెలుగు సినిమా రంగంలో సుస్ధిర స్థానం సంపాదించుకున్న కోడి రామకృష్ పేరు ఉభయ రాష్ట్రాల్లో నిలిచేలా చేయడం ఈ పురస్కారాల ముఖ్య ఉద్దేశ్యమని కార్యక్రమ సారథి – నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. నటుడు సుమన్‌కి ‘నట కేసరి’ బిరుదు ప్రదానం చేశారు.
కోడి రామకృష్ కుమార్తె కోడి దివ్య, తెలంగాణ ఎఫ్‌.డి.సి.చైర్మన్‌ అనిల్‌ కూర్మాచలం, నటులు మురళీ మోహన్‌, బాబు మోహన్‌, దర్శకులు రేలంగి నరసింహారావు, రోజారమణి, కవిత, దివ్యవాణి, వంశీ రామరాజు, ప్రముఖ వ్యాపారవేత్త బండారు సుబ్బారావు, మద్దుల ప్రకాష్‌, విజయలక్ష్మి, నంద కుమార్‌, రాయవరపు భాను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్‌ వర్మ దండు, ‘సామజవరగమన’ దర్శకుడు రామ్‌ అబ్బరాజు, కథా రచయిత భాను, ‘అనుకోని ప్రయాణం’ దర్శకుడు వెంకట్‌ పెదిరెడ్ల, సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ ప్రభు తదితరులు పురస్కారాలు అందుకున్నారు.