ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన కోడి వెంకన్న

– కాంగ్రెస్ లో చేరబోతున్నారంటు అంతట చర్చ…
నవతెలంగాణ – చండూరు 
మున్సిపల్ కేంద్రానికి చెందిన  చెందిన డీసీసీబీ డైరెక్టర్ కోడి సుష్మ భర్త, కౌన్సిలర్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు అయిన కోడి వెంకన్న, స్థానికంగా బిఆర్ఎస్ ముఖ్య నాయకుడిగా, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నమ్మిన బంటుగా, ముఖ్య అనుచరుడుగా ఉన్నారు. శుక్రవారం  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని  తన సోదరుడైన మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు తో కలిసి వెళ్లి హైదరాబాదులో కలిశారు. దీంతో కోడి వెంకన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఆయనను వివరణ కోరగా నల్గొండ డిసిసిబి చైర్మన్ అవిశ్వాస విషయమై ఎమ్మెల్యేను కలిశానని  రాజకీయ ప్రస్తావన ఏమీ లేదంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో చేరుతారా  లేదా  అనేది  కొంత సమయం  వేచి చూడాల్సిందే.