కొడిగంటి శ్రీధర్  కు డాక్టరేట్ ప్రధానం..

Kodiganti Sridhar has a doctorate.నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్  కెమిస్ట్రీ విభాగం  పరిశోధక విద్యార్థి కోడిగంటి శ్రీధర్  డాక్టర్ వాసం చంద్రశేఖర్ అసోసియేట్ ప్రొఫెసర్ పర్యవేక్షణలో” *లైగాండ్  ఫెసిలిటేటెడ్ అడ్సర్బషన్ ఆఫ్ హెవీ మెటల్స్ ఫ్రమ్ ఫ్రం ఆక్వాస్ మీడియం బై సెలెక్టెడ్ మైక్రోటు నానో స్ట్రక్చర్ అడ్సర్బంట్* అనే అంశంపై పరిశోధన జరిపారు. శుక్రవారం జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్సటర్నల్ ఎగ్జామినల్ ప్రొఫెసర్ ఎస్ చంద్రశేఖర్ భారత రక్షణ మరియు పరిశోధన సంస్థ నాగపూర్ హాజరై  పరిశోధన సిద్ధాంత గ్రంథం పై విస్తృతమైన, విశలమైన ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఎక్సటర్నల్ ఎగ్జామినర్ అడిగిన అన్ని ప్రశ్నలకు పరిశోధక విద్యార్థి ప్రయోగాత్మ కమైన ఉదాహరణలతో సమాధానాలు  ఇవ్వడంతో ఎక్సటర్నల్ ఎగ్జామినర్ పరిశోధన పట్ల  సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ పరిశోధనలో కలుషితమైన నీటినుండి ప్రమాదకరమైన బార లోహాలను తొలగించుటకు ముల్తాన్ మట్టిని ఆదిశోషకంగా వినియోగించి తక్కువ ఖర్చుతో  ప్రమాదకరమైన  భారలోహాలను  తొలగించే నీటి శుద్ధీకరణను తన పరిశోధన ద్వారా  నిరూపణ చేశారు.శ్రీధర్  అందించిన జవాబులకు  బహిరంగ మౌఖిక పరీక్షకు హాజరైన ప్రొఫెసర్ ఎస్ చంద్రశేఖర్ సంతృప్తి వ్యక్తం చేసి పీహెచ్డీ  డిగ్రీ ప్రధానానికి ఆమోదం తెలిపారు.ఈ పరిశోధన కొరకు జరిగిన ప్రయోగంలో రుజువైన ఫలితాలతో రాసిన మూడు వ్యాసాలు  ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ ప్రమాణాలున్న  అత్యధిక ఇంపాక్ట్ ఫ్యాక్టర్ కలిగిన  జర్నల్స్  ప్రచురించడం  ఈ పరిశోధనకు మరింత  గుర్తింపు వస్తుందని ఎక్సటర్నల్ ఎగ్జామినర్ ప్రొఫెసర్ ఎస్ చంద్రశేఖర్   పరిశోధకుడిని అభినందించాడు. తన పరిశోధనకు సహకరించిన   సౌత్ ఆఫ్రికా యూనివర్సిటీ ఆఫ్  క్వాజులు  నేటాల్   చెందిన ప్రొఫెసర్ జొన్నలగడ్డ శ్రీకాంత్ బాబుకు  పరిశోదక విద్యార్థి  శ్రీధర్  ఎంతో రుణపడి ఉన్నానని పేర్కొన్నారు.  ఈ బహిరంగ మౌఖిక పరీక్షకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల  కళాశాల ప్రిన్సిపాల్, సైన్స్ డీన్ సిహెచ్ ఆరతి, కంట్రోలర్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ, డాక్టర్ బోయపాటి శిరీష,  పర్యవేక్షకులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ ప్రసన్న శీల , కాంటాక్ట్ అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.