న్యూఢిల్లీ : ప్రముఖ కళ్లజోళ్ల తయారీ, విక్రయదారు ఎస్సిలర్ ఇండియాకు ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్రాండ్ ప్రచారకర్తగా వ్యవహా రించనున్నారు. తమ ఉత్పత్తులకు కోహ్లీని బ్రాండ్ అంబాసీడర్‌గా నియ మించుకోవడం ద్వారా ఎస్సిలార్ విలువ మరింత పెరగనుందని ఆ సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది. ఆయనతో క్యాంపెయిన్ వినూత్న బ్రాండ్‌ల యొక్క బలమైన పోర్ట్ ఫోలియోను ప్రదర్శిస్తుందని ఎస్సిలార్ లగ్జొటికా సౌత్ ఆసియా కంట్రీ హెడ్ నరసింహన్ నారాయణన్ అభిప్రాయపడ్డారు.