– ఐసిసి ఆల్‌టైమ్ టెస్ట్ ర్యాంకింగ్స్
దుబాయ్ : ఐసిసి ఆల్‌టైమ్ టెస్ట్ ర్యాకింగ్స్‌లో టాప్-20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లి చోటు దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ 937 పాయింట్లతో 12వ స్థానంతో ఈ క్లబ్‌లో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో నిలిచిన ఏకైక భారత బ్యాటర్ విరాట్ మాత్రమే. ఇక జో రూట్ 932 పాయింట్లతో ఆల్ టైమ్ టెస్ట్ ర్యాకింగ్స్‌లో 17వ స్థానాన్ని చేరుకున్నాడు. పాక్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో జో రూట్ తొలి డబుల్ సెంచరీని బాదాడు. పాక్‌పై 262 పరుగులు సాధించి తన ర్యాంకును మెరుగు పరుచుకున్నాడు. ఇంతకు ముందు ఆల్‌టైమ్ టెస్టింగ్ ర్యాకింగ్స్‌లో ఆస్ట్రేలియా లెజెండరీ ఆటగాడు డాన్ బ్రాడ్‌మ్యాన్ 961 పాయింట్ల తో టాప్-1లో ఉన్నాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, లెన్ హాటన్, రికీ పాంటింగ్, జాక్ హబ్స్, పీటర్ మే చోటు దక్కించుకున్నారు. ఇక వారి సరసన జో రూట్ స్థానం సంపాదించాడు.