– కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
తెలంగాణ కోసం తన మంత్రి పదవినే రాజీనామా చేసి ఈ ప్రాంత అభివద్ధి కోసం ఆనాడు బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు కు ఇక్కడికి తెచ్చింది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిఅని నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశంపేర్కొన్నారు శనివారంమండల పరిధిలోని బ్రాహ్మణవెల్లంల గ్రామంలో శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని కోమటిరెడ్డి అనిల్ రెడ్డి తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ :తెలంగాణ కోసం తన మంత్రి పదవినే రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభివద్ధి కోసమే పార్టీ మారిన బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఒక గుంటకు కూడ బ్రాహ్మణవెల్లంల నీరు ఎందుకు అందిచలేదన్నారు. తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు డబుల్ బెడ్ ఇండ్లులను ఈ గ్రామంలో 150 పూర్తి చేశాం, కానీ ఈ 5 సంవత్సరంలో కనీసం వాటిని పంపకం చేయాలేదన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలు రెండు ఒక్కటే అన్నారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దైద రవిందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య మాజీ జడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, గ్రామ ప్రజలు. పాల్గొన్నారు.