నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం అమెరికాకు వెళ్లనున్నారు. ఈమేరకు సన్నాహాలు పూర్తయ్యాయి. ప్రవాస భారతీయ లీడర్లతో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొననున్నారు. అలాగే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ తవ్వకాలకు సంబంధించి బేరింగ్ మెషినరీని సమకూర్చేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. ఈనెల 12న ఓహియోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈవో లాకహేోమ్‌తో భేటీకానున్నారు. ఇప్పటికే సీఎం, సీఎస్, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టేందుకు అమెరికాకు చేరుకున్న సంగతి తెలిసిందే.