నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం అల్లాపురం మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బొడ్డు గాలయ్య వార్డు మెంబర్లు రాసాల నాగరాజు యాదవ్,ఎంజాల గాలయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదేనని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఓడించాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు.గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అర్థ వెంకటరెడ్డి పాల్గొన్నారు