కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన రీజినల్ రింగ్ రోడ్డు బాధితులు

Komatireddy Rajagopal Reddy met Regional Ring Road victimsనవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
రీజనల్ రింగ్ రోడ్డు వల్ల భూములు కోల్పోతున్న చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల రైతులు, భువనగిరి నియోజకవర్గం లోని రాయగిరి ప్రజలు,గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని హైదరాబాదులో తన నివాసంలో మంగళవారం కలిశారు. రీజినల్ రింగ్ రోడ్డు  నిర్మాణంలో భూములు కోల్పోతున్నామని ప్రభుత్వంతో మాట్లాడి అలైన్మెంట్ మార్పించాలని  లేదా బహిరంగ మార్కెట్ విలువ ద్వారా పరిహారమైన చెల్లించాలని  రాజగోపాల్ రెడ్డిని కోరారు.రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణభాగం ఔటర్ రింగ్ రోడ్డు నుండి 40 కిలోమీటర్ల మేర తీసుకున్నారని,ఉత్తర భాగానికి వచ్చేసరికి ఔటర్ రింగ్ రోడ్డు నుండి 28 కిలోమీటర్ల దూరం మాత్రమే తీసుకున్నారని నా దృష్టికి తీసుకువచ్చారు.. కాగా ఉత్తరభాగం దక్షిణ భాగం జంక్షన్ చౌటుప్పల్ వద్ద  వస్తున్న నేపథ్యంలో భూములు ఎక్కువగా కోల్పోవాల్సి వస్తుందని  వీలైతే అలైన్ మెంట్ లో మార్పులు తీసుకురావాలని,అది సాధ్యం కానీ ఎడల భూములు కోల్పోతున్న  మాకు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఎంత ధర అయితే ఉందో  అంత ధర చెల్లించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి చర్చించాలని వేడుకున్నారు.ఈ సమస్య తన దృష్టిలో ఉందని త్వరితగతిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి  మీ సమస్యను చర్చిస్తానని రీజినల్ రింగ్ రోడ్డు  బాధితులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.