
చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకి చెందిన కొయ్యడి రవితేజ గౌడ్ ఇటీవలే అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతిచెందిన ఘటన తెలిసిందే.మూడు రోజులకు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. రవితేజ భౌతికాయాన్ని ఆదివారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఘటన జరిగిన తీరును కుటుంబ సభ్యులను అడిగి రాజగోపాల్ రెడ్డి తెలుసుకున్నారు.
భానును పరామర్శిస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామానికి చెందిన తిగుళ్ళ భాను సంవత్సర క్రితం గ్రామపంచాయతీ ట్రాక్టర్ వెనుక నుండి ఢీకొనడంతో త్రివంగ గాయపడి మంచానికే పరిమితమై ఇంట్లోనే వైద్యం చేయించుకుంటున్న యువకుడిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. భాను కోలుకోవడానికి ఆర్థిక సాయంతో పాటు హైదరాబాదులో మెరుగైన చికిత్స అందిస్తానని భాను తల్లిదండ్రులకు రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.