శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయంలో… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూజలు

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామం హైదరాబాద్ విజయవాడ రహదారి వద్ద శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయంలో మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం  ప్రత్యేక పూజలు జరిపారు.అనంతరం ప్రచార రతాన్ని పూజలు చేయించి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి పాలన పోవాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని భావించి బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చానని అన్నారు. గత ఎన్నికల్లో 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కెసిఆర్ అంగట్లో గొర్రెలను కొనుక్కున్నట్టు బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడే నా యుద్ధం కేసీఆర్ పై ప్రారంభమైందని దుయ్యబట్టారు.తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని రాజగోపాల్ రెడ్డి అన్నారు.ఆందోల్ మైసమ్మ ఆశీస్సులు నాపై ఉన్నాయని తప్పకుండా మునుగోడు నుండి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకే సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి, జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి,వైస్ ప్రెసిడెంట్ ఉప్పు భద్రయ్య, ఎంపీటీసీలు పందుల శ్రీశైలం, జెల్లా వెంకటేషశం, సురిగి శ్రీనివాస్,సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు కొయ్యడ సైదులు గౌడ్, ఉబ్బు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థ వెంకటరెడ్డి, పెద్దగోని రమేష్ గౌడ్.మోగుదాల పరమేష్ తదితరులు పాల్గొన్నారు