
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను విమర్శించే స్థాయి మీలాంటి గల్లి నాయకుల ది కాదని కాంగ్రెస్ పార్టీ ఐ ఎన్ టి యు సి ములుగు జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియాతో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. సీతక్కను విమర్శించే స్థాయి ప్రతిపక్షంలో ఎవరికి లేదని అన్నారు. సీతక్క జీవిత చరిత్రను ఒకసారి పరిశీలించి విమర్శ చేసే ముందు ఆత్మ విమర్శ చేసుకొని విమర్శ చేయాలని అన్నారు.మచ్చలేని గిరిజన మహిళ నాయకురాలు సీతక్క కాబట్టే ప్రజలు ములుగు నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేగా మంత్రిగా కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉందన్న విషయాన్ని గుర్తించాలని మరియు తెలంగాణ కుంభమేళా అయినా మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష పాత్ర పోషించిన సీతక్కను ములుగు ప్రజలు మరోసారి భారీ మెజార్టీని కట్టబెట్టడం జరిగిందని ప్రజల మెప్పుముందు ప్రతిపక్ష పార్టీ విమర్శలు లెక్కలేనివని అన్నారు. ఇకనైనా గౌరవంగా హుందాతనంగా ఉండాలని చీప్ గా దిగజారుడు రాజకీయాలు చేయవద్దని బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని జిల్లా అభివృద్ధిలో కలిసి రావాలని సూచించారు.