కన్నాయిగూడెం మండల కేంద్రంలోని కొమరం భీం విగ్రహా ఆవిష్కరణకు సహకరించాలని తుడుం దెబ్బ నాయకులు కోరారు. గురువారం కాల్వపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కరపత్రాలను ఆవిష్కరించారు. కొమరం భీమ్ ఆదివాసి అభ్యున్నతికి పోరాడి, జాతి వెలుగు కోసం అనేక పోరాటాలు చేశారని అన్నారు. అందుకు ఆయన స్ఫూర్తిగా ప్రతి మండల కేంద్రంలో కొమరం భీం విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇందులో భాగంగా కన్నాయిగూడెం మండల కేంద్రంలో కూడా ఫిబ్రవరి 3న ఏర్పాటు చేస్తున్న విగ్రహ ఆవిష్కరణకు ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు సహకరించి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు ఈసం నరసయ్య, ఉపాధ్యాయులు సిద్ధమైన స్వామీ, సుతారి వెంకటేష్, తుడుం దెబ్బ అధ్యక్షులు పోదాం బాబు తదితరులు పాల్గొన్నారు.