కొమురం భీముడికి ఘనంగా నివాళ్లు

Komuram was a great challenge to Bhimaనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
కొమురం భీం వర్దంతి వర్దంతిని పురస్కరించుకుని ఆయా పార్టీల ఆధ్వర్యంలో, ఆయా సంఘాల, యూనియన్ ల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళ్ళర్పించారు. పట్టణంలోని కొమురం భీం చౌక్ లో గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
మాల సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కొమురం భీం వర్దంతి నిర్వహించారు. దేశ అభివృద్ధి కోసం కొమురం భీం స్పూర్తి తో అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ కొప్పుల రమేష్, నాయకులు మేకల మల్లన్న, బొబ్బిలి సుధాకర్, ఏర సుధీర్, గంపల ప్రభాకర్, ముల్కల రాజేశ్వర్, బేర దేవన్న, సూరం భగవాండ్లు, దాసరి బాబన్న, పాశం రాఘవేంద్ర, వెంకటస్వామి,  ప్రకాష్, మాదస్తు అర్జున్, సుభాష్, జగదీష్  పాల్గొన్నారు.
సనాతన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో
సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భీం వర్ధంతిని నిర్వహించారు. కలెక్టర్ చౌరస్తాలోని భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు ప్రమోద్ ఖత్రి, గేడం మాదవ్, సూర్యకాంత్, కందుల రవీందర్, రేణికుంట రవీందర్, శ్రీనివాస్, సంతోష్, సంజీవ్, సత్యం, వేణు  పాల్గొన్నారు.
తుడుం దెబ్బ ఆధ్వర్యంలో
తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కుమురం భీం వర్ధంతిని వేడుకలను నిర్వహించారు. పట్టణంలోని కుమురం భీం కాలనీలో భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆదివాసులు ఐక్యంగా ఉండి భీం స్పూర్తితో ముందుకు సాగాలని ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు గోడం గణేష్, వెట్టి మనోజ్, రేణుక, ఉయిక ఇందిరా, ముకుంద్రావ్, ఆత్రం భూజంల్రావు, తులసిరాం పాల్గొన్నారు..
బొరంచు ఆధ్వర్యంలో
కుమురం భీం వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి భీంకు ఘన నివాళులర్పించారు. కలెక్టర్ చౌరస్తాలోని భీం విగ్రహానికి పూలమాలలు వేసి సేవలను కొనియాడారు. ఆయన వెంట మావల మండల అధ్యక్షుడు ధర్మపురి చంద్రశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ ఆట్ల గోవర్ధన్రెడ్డి, రహీంఖాన్, నాగరాజు, మర్సకోల గౌతం, రాజేందర్, వెంకటేష్, రంజిత్ రెడ్డి, లస్మన్న, బబ్లు ఉన్నారు.
ఆదివాసీ సేన ఆధ్వర్యంలో
గుడిహత్నూర్ లో ఆదివాసీ సేన ఆధ్వర్యంలో కొమురం భీం వర్దంతి నిర్వహించారు. గురువారం మండల కేంద్రంలోని ఆర్టిసి బస్టాండ్ సమీపంలోని కుంరం భీం విగ్రహం వద్ద ‌ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పూజాలు నిర్వహించారు. పూలమాలలతో నివాళులర్పించారు. ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాల్లో అవలంబిస్తున్న ప్రవేటికరణ, సరళికరణ విధానాలు ఆదివాసుల అస్తిత్వాన్ని దెబ్బతిస్తుయన్నారు. కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేందోర్ జలపతి, ఆదివాసి సేన  జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్, తుడుందెబ్బ నాయకులు ఉన్నారు.
టీయూటీఎఫ్ ఆధ్వర్యంలో
జల్ జంగల్ జమీన్ అను నినాదంతో గిరిజనుల హక్కుల కొరకు బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి అసువులు బాసిన కొమరం భీమ్ కు టీయూటీఎఫ్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కొరకు అస్తిత్వం కొరకు అటవీ భూములపై పంటల సాగు చేయుటకు బ్రిటిష్ ప్రభుత్వం తో కొమరం భీమ్ కొనసాగించిన పోరాటాన్ని కొనియాడారు. కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి జలంధర్ రెడ్డి, నారాయణ, సంజయ్, కరుణాకర్  పాల్గొన్నారు.