నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడి లో గల డాక్టర్ కేశవులు ఆసుపత్రి ఆవరణంలో గురువారం సకల జనుల ఆరాధ్య దైవం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్బంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కేశవులు తోపాటు ఆస్పత్రి సిబ్బంది తదితరులు కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.