నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి సమాజానికి ఆదర్శమని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం తన సొంత ఇంటిని త్రుణప్రాయంగా వదిలేసిన ఉద్యమ స్ఫూర్తి కొండా లక్ష్మణ్ బాపూజిది అని అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ మూడేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారని, ఎంతో కష్టపడి చదివి పైకి వచ్చారని తెలిపారు. కొండ లక్ష్మణ్ బాపూజీ క్రమశిక్షణ అందరికీ ఆదర్శమని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉంటే ఏ స్థాయికైనా ఎదుగుతారని కొండా లక్ష్మణ్ బాపూజీ నిరూపించారని అన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో మోతిలాల్, జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.