మున్సిపల్ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ జయంతి 

Konda Laxman Jayanti at Municipal Officeనవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోని  కొండ లక్ష్మణ్ బాపూజీ  జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ విముక్తికి కోసం, ప్రత్యేక రాష్ట్ర సాధనకు అవిరాళంగా కృషి చేసిన వ్యక్తి అని, అలుపెరుగని పోరాట యోధుడు, ఉద్యమ నేత  కొండ లక్ష్మణ్ బాపూజీ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, పట్టణ కౌన్సిలర్లు పాత శివ కృష్ణమూర్తి, ఇమ్రాన్  మొయినుద్దీన్, లడ్డు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.