రామారెడ్డి ఎస్ఐగా కొండ విజయ్

నవతెలంగాణ – రామారెడ్డి
రామారెడ్డి నూతన ఎస్సైగా కొండ విజయ్ శనివారం బాధ్యతలను స్వీకరించారు. స్థానికంగా పనిచేసిన ఎస్సై సుధాకర్ బదిలీపై ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేయగా, ఆయన స్థానంలో పిట్లం ఎస్సైగా పనిచేస్తున్న కొండ విజయ్ బదిలీపై రామారెడ్డి ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టారు. బదిలీపై వెళ్తున్న సుధాకర్ కు, నూతనంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కు పోలీస్ సిబ్బంది శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ సుభాషిని, జమీందార్ దేవా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.