రైలెక్కిన కొండా విశ్వేశ్వరరెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి మంగళవారం తాండూర్‌ నుండి శేరిలింగంపల్లి వరకు ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. పాడైన రోడ్లతో విసుగెత్తి తాను రైలెక్కినట్టు ఆయన చెప్పారు. అమత్‌ భారత్‌ పనులు పరిశీలిస్తూ, జనరల్‌ బోగీలో ప్రయాణం చేస్తూ, ప్రయాణీకుల సమస్యలు తెలుసుకుంటూ ఆయన ప్రయాణం సాగింది. ఉదయం 7.30 గంటలకు ఆయన శేరిలింగంపల్లి స్టేషన్‌లో రైలు దిగి, అక్కడి నుంచి కారులో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.