నవతెలంగాణ – భువనగిరి కలక్టరేట్
జిల్లా వ్యాప్తంగా ఐకెపి, పీఏసీఎస్ సొసైటీ కేంద్రాలలో నిలువ ఉన్న ధాన్యం, లారీల కొరతను, గన్ని బ్యాగుల కొరతను వెంటనే నివారించాలని, తరుగు పేరుతో క్వింటాకు 5 కిలోల చొప్పున మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్న దానిని అరికట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, మాట్లాడారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు రైతుల బాధలు పట్టించుకోని ధాన్యం కొనుగోలును వేగవంతం చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గునుగుంట్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బొల్లెపల్లి కుమార్, సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్ , ఏరియా కార్యదర్శి ఎదునూరి వెంకటేష్, నాయకులు గంగనబోయిన బాల నరసింహ, బొల్లెపల్లి స్వామి, బొల్లెపల్లి కిషన్, కడారి కృష్ణ , పిట్టల శ్రీశైలం, కడ మంచి రవి, రైతులు శ్రీరామ్ శ్రీశైలం , పున్నమ్మ, యాదయ్య లు పాల్గొన్నారు.