నవతెలంగాణ-చౌటుప్పల్: మునుగోడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం నామినేషన్ పత్రాలతో ఆందోల్ మైసమ్మ వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీతో చండూరు నామినేషన్ కేంద్రానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ సంక్షేమ పథకాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థి నన్ను మరొకసారి గెలిపించి మిగిలిపోయిన అభివృద్ధి పనులు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు పల్లె రవికుమార్ గౌడ్, మాజీ జెడ్పిటిసి సభ్యులు పెద్దిటి బుచ్చిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు నిరంజన్ గౌడ్, ముత్యాల ప్రభాకర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కొత్త పర్వతాలు యాదవ్, బిఆర్ టియు జిల్లా అధ్యక్షులు ఢిల్లీ మాధవరెడ్డి సర్పంచులు ఎలువర్తి యాదగిరి, కళ్ళెం శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ ఆల్మాసిపేట కిష్టయ్య, చిన్నం బాలరాజు కురుమ తదితరులు పాల్గొన్నారు.