– మాజీ ఎంపీపీ, కౌన్సిలర్ తోకల వెంకన్న
నవతెలంగాణ – చండూరు
ముదిరాజు లుఅంతా కలిసి, ఐక్యతగా ఉండి బిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ,కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎంపీపీ, కౌన్సిలర్, తోకల వెంకన్న అన్నారు. శనివారం రాజశ్రీ మినీ ఫంక్షన్ హాల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 30న జరిగే ఎన్నికలలో.. రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ సోదరులకు కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎమ్మెల్సీలు ఇచ్చే అవకాశం ఉన్నదని అన్నారు. కొంతమంది ముదిరాజ్ బంధువులు ముదిరాజులకు టికెట్ ఇవ్వలేదని ఎత్తిచూపడం జరుగుతుందన్నారు.ఇది సరైన కాదు అన్నారు. ముదిరాజులకు రాజకీయ చైతన్యంతో పాటు సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. బండ ప్రకాష్ ముదిరాజ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఇచ్చిన ఘనత బి.ఆర్.ఎస్ పార్టీది అన్నారు. ముదిరాజులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల, బిఆర్ఎస్, పార్టీ అధ్యక్షుడు పాటల వెంకన్న, భువనగిరి పచ్చ కార్మిక సంఘం అధ్యక్షుడు పాశం సంజయ్ బాబు, ఆడెపు సురేష్, సంగేపు శ్రీనివాసులు, ఉడతల పల్లిఎంపిటిసి కావలి. మంగమ్మ ప్రసాద్, బొమ్మ బోయిన రాజు . గండూరి నగేష్, యు వెంకన్న , తదితరులు పాల్గొన్నారు.