కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బతుకమ్మలతో బ్రహ్మరథం పడుతున్న మహిళలు

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలంలోని కేసారం,నేలపట్ల,కుంట్లగూడెం మందోల్లగూడెం,ఎస్.లింగోటం,అంకిరెడ్డిగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బతుకమ్మలతో మహిళలు కోలాటాలతో గ్రామాలలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బ్రహ్మరథం పడుతూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడును అభివృద్ధి చేశాను.మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీనిచ్చారు. కెసిఆర్ హయంలోనే మునుగోడు మరింత అభివృద్ధి చెందిందని మరొకసారి గెలిపించి మునుగోడులో మిగిలిపోయిన పనులు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు పల్లె రవికుమార్ గౌడ్, బీఆర్ఎస్ చౌటుప్పల్ మండల అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్.మాజీ జెడ్పిటిసి పెద్దిటి బుచ్చిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, సర్పంచులు కుర్పూరి సైదులు వేణుగోపాల్,రిక్కల ఇందిరసత్తిరెడ్డి,మిర్యాల పారిజాత,బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు,మాజీ సర్పంచులు మల్లేష్ గౌడ్,అల్మాసిపేట కిష్టయ్య  తదితరులు పాల్గొన్నారు