నవతెలంగాణ – ధర్మారం
మండలం లోని రామయ్య పల్లి గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకుడు మండల మల్లయ్య అనారోగ్యం తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పెద్దపల్లి ఎంపీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆదివారం రోజు ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మా అనారోగ్యం నుండి త్వరలో కోరుకోవాలని ఆకాంక్షించారు తనకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్, కార్యదర్శి దొనక్కన తిరుపతి గౌడ్, సీనియర్ నాయకుడు మూల మల్లేశం గౌడ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.