పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయo: కోట కిషోర్

నవతెలంగాణ – అచ్చంపేట 
పద్మశాలి సమాజం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పద్మశాలి యువజనసంఘం జిల్లా అధ్యక్షులు కోట కిషోర్ గురువారం పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉన్న కార్పొరేషన్లు కేవలం చేనేత ఆధారంగా ఉన్న పద్మశాలి, చేనేత కుటుంబాలకి మాత్రమే అందుబాటులో ఉండేవి. పద్మశాలి జనాభాలో అత్యధిక శాతం చేనేత వృత్తి వెలువల ఉన్నారు. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం పలు చర్యలు తీసుకోవలసిందిగా గత ప్రభుత్వాలను అభ్యర్తించినా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వృత్తి వెలుపల ఉన్న పద్మశాలీల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కొరకు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్పొరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు 30 లక్షల మంది పద్మశాలీలకు ఒక భరోసగా పని చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. పద్మశాలి కార్పొరేషన్ పద్మశాలి కుల బంధువులకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తూ పద్మశాలి సమాజంలో అత్యంత వెనుకబడిన వారికి వెన్నుదన్నుగా నిలవాలని ఆశించారు. పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించిన క్యాబినేట్ మంత్రులకు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.