నవతెలంగాణ – ఆర్మూర్
ఇంటర్ ఫలితాలలో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా ముందుకు సాగారు .తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించారు. రెండవ సంవత్సరం 60 శాతం ఉత్తీర్ణత సాధించగా ఇందులో బాలికలదే పై చేయి. పట్టణంలోని గీత మెడికల్ యజమాని కోట నరేష్, గీత దంపతుల కుమార్తె కోట సిరి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 968 మార్కులు సాధించింది. ప్రాథమిక విద్యాభ్యాసం పట్టణంలోని విజయ్ హై స్కూల్ లో చదివిన విద్యార్థిని చిన్ననాటి నుండి కూచిపూడి,, భరతనాట్యం తదితర నృత్య ప్రదర్శనలతో జిల్లా,, రాష్ట్ర స్థాయిలోనే ప్రతిభ కనబరిచింది. ఉత్తమ మార్కులు రావడం ఆనందంగా ఉందని ,,అమ్మ నాన్నలు ఎంతో కష్టపడి చదివించినట్టు,, భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా సేవ చేయాలని ఉందని ఈ సందర్భంగా తెలిపిది.