
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మేజర్ పంచాయితీ కార్యదర్శిగా కోటమర్తి శ్రీరామమూర్తి నియామకం అయ్యారు.ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖ జిల్లా ఉన్నతాధికారులు ఈయనను డిప్యుటేషన్ పై ఇక్కడకు పంపారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో అశ్వారావుపేట కార్యదర్శి హరిక్రిష్ణ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం,పేరాయిగూడెం కార్యదర్శి శ్రీరామమూర్తి దమ్మపేట మండలం సీతారాంపురం బదిలీ అయ్యారు. కానీ పేరాయిగూడెం కార్యదర్శిగా గుండాల మండలం నుండి సందీప్ జాయిన్ అయ్యారు. అశ్వారావుపేట కార్యదర్శి పోస్ట్ ను ఎవరూ కోరుకోలేదు.ఈ కారణం తో భర్తీ కాలేదు.నియోజక వర్గం కేంద్రం కావడం,మండలంలో ఏకైక మేజర్ పంచాయితీ కావడం తో పరిపాలనా సౌలభ్యం కోసం శ్రీరామమూర్తి ని ఇక్కడకు డిప్యుటేషన్ పై బదిలీ చేసారు.ఆయన సోమవారం అశ్వారావుపేట లో విధుల్లో చేరారు.