పోలీసులను అభినందించిన కోటపాటి

నవతెలంగాణ- ఆర్మూర్ 

ఘరానా చీటర్ బషీర్ నువ్వు డిచ్పల్లి పోలీసులు అరెస్టు చేయడం పట్ల  ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి. నరసింహ నాయుడు గురువారం అభినందించారు. గత సంవత్సరం డిసెంబర్ డిచ్ పల్లిలో  ఆర్కే ట్రావెల్స్ పేరుతో వందలాది మంది దగ్గర కోటి రూపాయలకు పైగా వసూలు చేసి పారిపోయిన శేక్ బషీర్ ను ఎట్టా కేలకు డిచ్ పల్లి పోలీసులు వారం రోజుల క్రితం అరెస్టు చేసి రిమాండ్ కు పంపించిన డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కస్పరపు కృష్ణ డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ లో  బషీర్ చేతిలో మోసపోయిన వారి తో కలిసి అభినందించి , ధన్యవాదాలు తెలిపారు.  శేక్ బషీర్ ఒక్కొక్కరి దగ్గర 25 వేలకు పైగా 400 మంది దగ్గర కోటి రూపాయలకు పైగా వసూలు చేసి ఆంధ్రలో ఆస్తులు కొని అమాయకులను మోసగించాడు. శేక్ బషీర్ ను P. D యాక్ట్ క్రింద నిర్వర్తించాలి. శేక్ బషీర్ ను రిమాండ్ కు పంపించినప్పటికీ బెయిల్ పై విడుదల అయ్యే అవకాశం ఉంది కాబట్టి బాధితులు ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టామని దరఖాస్తు చేసుకున్నారు . వాటన్నిటిపై కేసులో నమోదు చేసి బషీర్  క్రింద అరెస్టు చేసి బాధితుల డబ్బు రికవరీ అయ్యేంతవరకు విడుదల కాకుండా చూడాలని ఇటీవల జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరడం జరిగింది . మంత్రిగారు వెంటనే స్పందించి ఇంచార్జ్ సిపి  తో మాట్లాడి షేక్ బషీర్ పై కఠిన చర్య తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.   కాబట్టి ఇప్పటికే పెండింగ్ లో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు స్పందించి కేసు బుక్ చేయాల్సిందిగా కోటపాటి డిమాండ్ చేశారు.