ఢిల్లీ రైతు ఉద్యమంలో కోటపాటి

నవతెలంగాణ – ఆర్మూర్
ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి ఉన్న రైతులకు పసుపు రైతుల సంఘం అధ్యక్షులు దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షులు కోటపాటి నరసింహం నాయుడు సంఘీభావం తెలుపుతున్నట్టు ఒక ప్రకటనలు తెలిపారు. పసుపు రైతుల కోసం స్వయంగా పోలీసు వలయాన్ని ఛేదించుకొని అనేక బస్సులు , ట్రాక్టర్లు అదేవిధంగా ఆటోలలో  మారుకుంటూ అక్కడికి వెళ్లి సంఘీభావం తెలియజేశారు.  ఇది పంజాబ్ హర్యానా బార్డర్ లోని సంగ్రూరు వద్ద మరియొక్క రైతు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తరఫున వాళ్లకు  సంపూర్ణ మద్దతును తెలియజేశారు.ముఖ్యంగా రైతులు చేస్తున్నటువంటి ఉద్యమం కనీసపు మద్దతు ధరల చట్టం   వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. అదేవిధంగా ఎమ్మెస్ స్వామినాథన్  కమిషన్ ఇచ్చినటువంటి రికమండేషన్  ప్రకారము 50% శాతం అదనంగా మరి గిట్టుబాటు ధర చెల్లించే విధంగా చట్టం చేయాలి. అదే విధంగా గతంలో రైతుల మీద పెట్టినటువంటి కేసులు ఉపసంహరించాలని మూడు ప్రధాన డిమాండ్ల కోసం ఈరోజు ఆందోళన జరుగుతుంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనేక నిర్బంధాలు విధిస్తూ మరియొక్క ఈ రైతు ఉద్యమాన్ని చదరగొట్టే ప్రయత్నం చేస్తుంది కానీ రాజకీయాల అతీతంగా సంయుక్త కిసాన్ మోర్చా చేపట్టి ఆందోళనలో వేలాదిమంది ఒక ఈ యొక్క సంగ్రూరు వద్ద కు పంజాబీ నుంచి వచ్చినటువంటి రైతులు హర్యానా బార్డర్లో హర్యానాలో నిలిపివేశారు. హర్యానాలో  బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడే ఆపేశారు దీంతో సంపూర్ణ మద్దతు తెలిపినట్లు నవతెలంగాణ కు చెప్పారు.