
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా పట్టణానికి చెందిన డాక్టర్ మధుశేఖర్ గురువారం పదవి బాధ్యతలు స్వీకరించినారు. ఈ సందర్భంగా హైదరాబాదులో మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, లతో పాటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిసినారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహ నాయుడు వైద్యులు మధు శేఖర్ ను పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.